Jagga Reddy: రేవంత్‌రెడ్డి ఇచ్చుడు కాదు.. నేనే ఝలక్ ఇస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాకు ఝలక్ ఇచ్చుడు కాదు.. నేనే ఝులక్ ఇస్తానని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాకు ఝలక్ ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో నన్ను మరింత హట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా అని ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్ పై బురద జల్లే అవసరం నాకు లేదు.. ఇలాంటి అవకాశం కల్పించింది కూడా రేవంతే అన్నారు.. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని కోరుకుంటున్న.. జీవితాంతం ఉండాలని ఉంది.. నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. పార్టీలో ఉంటున్నాను అన్నారు.. అయితే, ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ టైపు అయ్యింది నా పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను హీరోయిన్.. హీరో కాంగ్రెస్ పార్టీ .. విలన్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు.. రేవంత్‌రెడ్డికి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వలేదు అని వ్యాఖ్యానించారు.
Read Also: Ukraine Russia War: చిక్కుల్లో రష్యా అధ్యక్షుడి లవర్..! ఆమెను తరిమేయాలంటూ..!
Also Read
- TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
- BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
- SHAKTI : తెలంగాణలో కార్మిక, ఉపాధి శాఖ పేరు మార్పు.. ఇకపై ‘శక్తి’ శాఖగా..
కాంగ్రెస్ పార్టీతో కానీ.. సోనియా, రాహుల్ గాంధీతో గానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఎదిగాను.. విజయవంతంగా నడిపించుకున్నాను.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకున్న అలవాటు అన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో కూడా అలాగే చెప్పినా.. విడిపోతే నష్టం అని చెప్పినా.. ఆ రోజు తెలంగాణ ద్రోహిగా ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. పీసీసీ కావాలని నేను కూడా అడిగా… రేవంత్ అయ్యారు.. మేడం నిర్ణయం అని వదిలేశా అన్నారు.. తెలంగాణ వ్యతిరేకించిన సమయంలో కూడా నాతో కాంగ్రెస్ నాయకులు ఎవరు రాలేదన్నారు జగ్గారెడ్డి.. ఇక, సోనియా, రాహుల్‌ది గొప్ప ఫ్యామిలీ… రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తికి కూడా క్షమాభిక్ష పెట్టండి అని చెప్పారు.. అది వాళ్ల గొప్పతనం అన్నారు జగ్గారెడ్డి. మరోవైపు, పంచాయితీ అంతా రేవంత్… నాకేనన్న ఆయన.. నేను కాంగ్రెస్ పార్టీని నష్ట పరుస్తునా అని అనుకుంటున్నారు.. కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్.. జగ్గారెడ్డిల గుణం ఏంటని చెప్పా అన్నారు.. రేవంత్ తో కలిసి పని చేయడానికి ఇబ్బంది లేదని ఎన్నో సార్లు చెప్పినా.. అయినా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు.. నేను బీజేపీ నుంచి టీఆర్‌ఎస్‌కి వెళ్లినా.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చా.. రెండు మూడు పార్టీలు నేను కూడా తిరిగినా.. కానీ, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, ఉత్తమ్‌లపై కూడా సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కండువాలు కప్పు తున్నారని మండిపడ్డారు జగ్గారెడ్డి.
తాజావార్తలు
-
Smartphones in Budget: రూ. 15,000 లోపు భారీ బ్యాటరీ లైఫ్ బెస్ట్ 5G స్మార్ట్ఫోన్లు ఇవే.. రెండు రోజుల బ్యాకప్ గ్యారెంటీ!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
-
TS Police Recruitment 2026: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 5,000 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్!
-
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
-
Keeway Hypvolt-R: భారత్‌లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
ట్రెండింగ్
-
EV కారు కొనాలనుకుంటున్నారా? Hyundai Creta ఎలక్ట్రిక్ కు కొత్త BaaS ప్లాన్.. రూ.7 లక్షల వరకు తగ్గింపు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ అరంగేట్రంపై విమర్శలు.. మా ఇష్టం అంటూ మాజీలకు గట్టిగా ఇచ్చిపడేసిన బీసీసీఐ!
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!