Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
- రాష్ట్రవ్యాప్తంగా 3,241 కాలేజీలకు అనుబంధ గుర్తింపు
- మరో 12 కాలేజీలకు అనుమతులు ఇవ్వనున్న బోర్డు
- 65 కాలేజీల్లో నకిలీ ఫైర్ సేఫ్టీ పత్రాలు గుర్తింపు
- కార్పొరేట్ కాలేజీలకు రూ.4 కోట్లకు పైగా జరిమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపుల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) ఖండించింది. నిబంధనలు పాటించిన కళాశాలలకే గుర్తింపు ఇస్తున్నామని, విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,241 జూనియర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేసినట్లు వెల్లడించింది. కార్పొరేట్ కళాశాలలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నామన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది.
మరో 12 కాలేజీలకు అనుమతులు
2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 3,349 జూనియర్ కళాశాలలకు గుర్తింపు లభించగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటివరకు 3,241 కళాశాలలకు అనుమతులు మంజూరయ్యాయని బోర్డు తెలిపింది. అవసరమైన డాక్యుమెంటేషన్, కళాశాల ప్రాంగణ మార్పులకు సంబంధించిన పరిశీలన పూర్తయిన వెంటనే మరో 12 కళాశాలలకు అడ్మిషన్ల అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విద్యార్థులు ఒక్కరూ చేరకపోవడంతో 27 కళాశాలలు స్వచ్ఛందంగా జీరో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నాయని పేర్కొంది. మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు లేని కళాశాలలకు నిబంధనల ప్రకారం గుర్తింపు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
Also Read
- Scrap Shop Explosion: రామంతాపూర్ స్క్రాప్ దుకాణంలో భారీ పేలుడు.. ఒకరి పరిస్థితి విషమం
- TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
- Telangana Rice Mill Scam: రైస్ మిల్లర్ల ‘మాయా’జాలం.. ఖజానాకు భారీ గండి!
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
65 కాలేజీల్లో నకిలీ ఫైర్ సేఫ్టీ పత్రాలు
కళాశాలల తనిఖీల్లో 65 జూనియర్ కళాశాలలు నకిలీ ఫైర్ సేఫ్టీ నిరభ్యంతర పత్రాలు (NOCలు) సమర్పించినట్లు గుర్తించామని బోర్డు వెల్లడించింది. విద్యార్థుల ప్రాణాలు, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమని స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలను పాటించని కళాశాలల విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని తెలిపింది.
కార్పొరేట్ కాలేజీలకు జరిమానాలు
కార్పొరేట్ కళాశాలలకు బోర్డు కొమ్ముకాస్తోందన్న విమర్శలను అధికారులు తోసిపుచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన కార్పొరేట్ కళాశాలలపై జూలై నుంచి అక్టోబర్ వరకు రూ.4 కోట్లకు పైగా జరిమానాలు విధించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ తనిఖీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని, కళాశాలల యాజమాన్యాలను వేధించేందుకు వాటిని నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
నిబంధనల అమలుకు ప్రత్యేక కమిటీ
కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా సహకరించేందుకు హై-లెవల్ కంప్లయన్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు బోర్డు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలల్లో గుర్తించిన లోపాలను అధికారిక వెబ్సైట్లో బహిరంగంగా ఉంచే ఆలోచన కూడా ఉందని తెలిపింది. తప్పుడు సమాచారం, వదంతులు వ్యాప్తి చేస్తూ బోర్డుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను మానుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత, విద్యార్థుల భద్రత, నిబంధనల అమలుకే ప్రాధాన్యం ఇస్తామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Mallikarjun Kharge: ‘మోదీ తండ్రి కూడా పోతాడు’.. ప్రధానిపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు!
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
January 12 Release టీమ్ బిగ్ స్కెచ్.. క్లైమాక్స్ సీన్లు అదిరిపోయేలా ప్లాన్!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!