Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
- సరూర్‌నగర్ సభ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్
- సోనియా గాంధీ అంశాన్ని గుర్తుచేసిన జగ్గారెడ్డి
- గ్రూప్-1 పేపర్ లీక్‌పై బీఆర్ఎస్ను టార్గెట్
- గాంధీ కుటుంబం మాట నిలబెడుతుందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరూర్ నగర్ సభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై కేటీఆర్ ‘డెత్ డిక్లరేషన్’ అంటూ మాట్లాడటంపై ఆయన తీవ్ర కౌంటర్ ఇచ్చారు. అసలు కేటీఆర్‌కు ఏమాత్రం రాజకీయ నియత్ (నిజాయితీ) ఉందా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయం గాంధీ కుటుంబానిదైతే.. విలువలు లేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివని మండిపడ్డారు.
సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతి మర్చిపోయారా?
ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే సోనియా గాంధీకి తన చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తానని కేసీఆర్ అన్న మాటలను జగ్గారెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లు మొక్కిన సంగతిని ఇప్పుడు ఎలా మర్చిపోతారని నిలదీశారు. నాడు కాళ్లు మొక్కి, ఇప్పుడేమో అదే గాంధీ కుటుంబంపై డెత్ డిక్లరేషన్ ప్రకటిస్తావా అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు. కేటీఆర్ రక్తంలో ఎక్కడా నిజాయితీ, కృతజ్ఞతా భావం లేవని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఆ కుటుంబం నాశనాన్ని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
మాట ఇస్తే నిలబెట్టుకునేది రాహుల్ గాంధీ.. మోసం చేసేది కేసీఆర్ కుటుంబం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు, కేటీఆర్ అశోక్ నగర్ వెళ్లి ఏ రోజైనా నిరుద్యోగులకు సమాధానం చెప్పారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నాడు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని, ఇవాళ నీతులు చెబుతున్నారని విమర్శించారు. గాంధీ కుటుంబం ఏనాడైనా మాట ఇస్తే దానికి కట్టుబడి నిలబడుతుందని, కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం మాట ఇస్తే మోసం చేయడమే అలవాటుగా మార్చుకుందని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏ స్థాయికైనా దిగజారే నైజం కేసీఆర్ కుటుంబానిదేనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!