Jagadish Reddy comments on komatireddy rajgopal reddy: మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలుపొందుతునందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంల పుట్టపాకలో కార్యకర్తల కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఎగిరేగి గులాబీ జెండాయే అని ఆయన అన్నారు. కాషాయం కనుచూపు మేరలో లేదని వ్యాఖ్యానించారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన అన్నారు. సర్వేలన్నీ తేల్చి చెబుతోంది ఇదే అని అన్నారు.
Read Also: BJP: ఏపీలో బీజేపీ భారీ స్కెచ్.. ఏకంగా 5 వేల సభలు..!
కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని.. ఆ పార్టీ పతనం అంచున చేరే సరికి బీజేపీ పాట పాడుతున్నారని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వి బ్రోకర్ మాటలు, బ్రోకర్ దందాలు అని విమర్శించారు. అన్ని నియోజకవర్గాలకు నిధులు సమానంగా ఇచ్చామని ఆయన అన్నారు. అబద్దాలు చెప్పడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ను మించిన వాళ్లు లేరని ఎద్దేవా చేశారు. మూడేళ్ల నుంచి బీజేపీ కోవర్ట్ గా రాజగోపాల్ రెడ్డి పనిచేశారని ఆరోపించారు. కాంట్రాక్టుల ఒప్పందం కుదరగానే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. రాజీనామా చేస్తే ఉప ఎన్నికలే వస్తాయి అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్ది ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో పాటు మునుగోడు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహించాయి. ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఫిక్స్ కాకున్నా.. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ప్రారంభించాయి.