NTV Telugu Site icon

KCR: అయోధ్య రామాలయ ప్రారంభానికి కేసీఆర్‌కు ఆహ్వానం.. వెళతారా?

Kcr

Kcr

KCR: ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం భారతీయుల కలను సాకారం చేయనుంది. జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది.ప్రాణప్రిష్ట మహోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామ నామంలో మునిగి తేలుతున్నారు. రామమందిర ప్రారంభోత్సవంలో దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. ప్రాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపున తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది.

Read also: CM Revanth Reddy: లండన్‌ పర్యటలో రేవంత్‌ కు ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన యువతి

మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం అందింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు ఆహ్వానం పంపారు. ఇక ఇప్పటికే జనవరి 22న జరగనున్న రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య రాముడు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వివిధ రూపాల్లో సేవలు అందుతున్నాయి. ట్రస్టు ఆలయ ప్రారంభోత్సవానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక కూడా పంపారు. అయితే.. ఇటీవల సీఎం కేసీఆర్ తుంటి ఎముక ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడే.. కర్ర సాయంతో నడవడం మొదలుపెట్టాడు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. అయోధ్య ప్రాణ ప్రతిష్టకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. మరి అయోధ్య రామ ప్రతిష్టకు వెళతారా? లేదా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
CM MK Stalin: ప్రధాని మోడీ సహాయంతో నడిచిన తమిళనాడు సీఎం