CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన నిన్నటితో ముగిసింది. అయితే ఇప్పుడు లండన్ లో పర్యటిస్తున్నారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జనవరి 15 నుంచి 19 వరకు దావోస్‌లో పర్యటించిన రేవంత్ తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు.. లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. అయితే రేవంత్ లండన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం రేవంత్ స్టేజ్ పై మాట్లాడుతున్న క్రమంలో ఓ యువతి ఆయనకు ప్లవర్ బోకే చేతికి ఇచ్చింది. అంతేకాకుండా రేవంత్ కు అందరిముందు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. సీఎం కు షేక్ హ్యాండ్ ఇవ్వాలని కోరుతూ చేయిచాచింది.
Read also: CM MK Stalin: ప్రధాని మోడీ సహాయంతో నడిచిన తమిళనాడు సీఎం
అయితే సీఎం రేవంత్ ఆ యువతి హుత్సాహం చూసి మురిసిపోయారు. ఆ యువతికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆ యువతి ఉత్సాహం మరింత పెరిగింది. సీఎం రేవంత్ సార్ అంటూ స్టేజ్ ముందు ఎగురుతూనే వుంది. ఆ యువతి సీఎం రేవంత్ రెడ్డిపై చూపిన అభినాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అంతమంది ఉన్నా కూడా రేవంత్ పై ఆ యువతి అభిమాన్ని చూపుతూ ప్లయింగ్ కిస్ ఇస్తున్న వీడియోను కెమెరా క్యాచ్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కాగా ఈ వీడియో చూసిన వాళ్లందరు తెగ కామెంట్లు చేస్తున్నారు. రేవంత్ అన్నా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో కాదు రేవంత్ అన్నకు ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు ఉంటారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Israel Hamas War: గాజాలో రోజురోజుకు దిగజారిపోతున్న మహిళలు, చిన్నారుల పరిస్థితి