రంగారెడ్డి జిల్లా చేవెళ్ల టీఆర్‌ఎస్ అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సవాళ్లు, ప్రతి సవాళ్లతో నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే కాలే అవినీతి పరుడని, ఈసారి తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంపై మండిపడ్డారు కాలే. కుంట భూమి కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. అక్రమ ఆస్తులు ఉంటే… సీబీఐ దర్యాప్తుకైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. ఇక, తాడు, బొంగరం లేని మాజీ ఎమ్మెల్యే రత్నం నాపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. టికెట్ నాకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం అనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
Read Also: Ukraine Russia War: వార్ జోన్లలో 3 వేల మంది భారత విద్యార్థులు..!
తాను, కుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలకు దూరమవుతానని ప్రకటించిన కాలే యాదయ్య.. నాకున్న ఆస్తి ఎన్నికల ఆఫిడవిట్‌లో చూపించానని.. నేను వంద ఎకరాలు సంపాదించానని చెబుతున్నారు కదా.. నువ్వు వంద ఎకరాలు చూసిస్తే నియోజకవర్గ పేదలకు పంచుతానని సవాల్ విసిరారు.. అక్రమంగా సంపాదించినట్లయితే నా ఆస్తులసై సీబీఐ విచారణ జరపించాలని సవాల్ చేసిన ఆయన.. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు నీ లీలాలు తెలియనివా? అని సెటైర్లు వేశారు. 1995లోనే నీకు ఉచ్చ పోయించా… నీతో ముఖాముఖి మాట్లాడటానికి నేను రెడీ… దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధమా ? అంటూ బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాలే యాదయ్య.