Inter education department ad prasannalata suspended: ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేస్తున్న కేఎం ప్రసన్నలతపై సస్పెండ్సన్ వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేస్తూ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె తండ్రి పీటర్ సూపరింటెండెంట్ గా పనిచేస్తూ చనిపోయారు. దీంతో 1993లో కారుణ్య నియామకం కింద ప్రసన్నలతకు జూనియర్ అసిస్టెంట్ గా చేరారు. ఆతరువాత పదోన్నతులు పొందిన ఆమె ప్రస్తుతం ఏడగా కొనసాగుతున్నారు. అయితే కారుణ్య నియామకం కొంద ఉద్యోగంలో చేరాలంటే ఆ కుటుంబంలోని వారు ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులై ఉండరాదు.
Read also: kalwakurthy TRS : అక్కడ ఇప్పటికే రెండు వర్గాలు..ఇప్పుడు మరో వర్గం తయారైందా.?
కాగా.. ప్రసన్నలత తల్లి సౌభాగ్యమ్మ అప్పటికే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తల్లి సౌభాగ్యమ్మ 2010లో పదివీ విరమణ పొందారు. ఇప్పుడు తల్లి సౌభాగ్యమ్మ ప్రస్తుతం పింఛను పొందుతున్నారు. దీంతో అధికారులకు ఈవిషయం తెలవడంతో.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేసారు. ఈ విషయాలన్ని వెల్లడించకుండా అక్రమంగా ప్రసన్నలత ఉద్యోగం పొందారని సస్పెండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇంకెవరూ ఇలా అక్రమంగా ఉద్యోగం పొందరాదని ఈ విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ జలీల్ వెల్లడించారు.
Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ.. ఎవరికెన్ని పదవులంటే..