ఇప్పటి చిన్న పిల్లలకు చేతిలో ఫోన్ వుంటే చాలు అందులోనే ప్రపంచం వుంటుంది. అది వుంటే తిండి నిద్ర, నీరు ఏమీ అవసరం వుండదు. ఫోన్ చూసుకుంటూ పక్కన ఏంజరుగుతుందో కూడా గమనించరు. అలా మారింది మన ప్రపంచం. నూటికి తొంభైతొమ్మిది శాతం యువత ఇప్పుడు ఫోన్ తోనే గడపేస్తుంది. కొందరికైతే అదే ప్రపంచం. గేమ్ ఆడుకుంటూ ప్రపంచాన్నే మరిచి అందులో ఆడుతున్నది వారే అన్నట్లు ఫీలవుతూ అందులో నిమగ్నమైపోతారు. ఫోన్ లో గేమ్‌కు బానిసైన ఓ బాలుడు మతిస్థిమితం కోల్పోయిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పదిహేను ఏళ్ల విద్యార్థి మానసిక అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు అతన్ని తమిళనాడులోని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఈఏడాది ఏప్రిల్ 10న జరిగిన ఆఘటన మరువకముందే.. ఫ్రీ ఫైర్ గేమ్ ఓ బాలుడి ప్రాణాలు తీసింది, ఫోన్లో గేమ్ ఆడుతుండగా, పాము కాటు వేసింది. బాలుడు అది కూడా చలనం లేకుండా గేమ్‌లో నిమగ్నమైపోయిన ఘటన మధ్యప్రదేశ్ లోని ఇందోర్‌లో జరిగింది. మృతి చెందిన బాలుడు రింకూగా గుర్తించారు పోలీసులు.
వివరాల్లో వెళితే.. ఇందోర్ చందన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం ఇటుక బట్టీలో పని చేస్తోంది. వారి స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పుర్. కాగా, గత రెండేళ్లుగా ఇతడు ఇక్కడ పని చేస్తున్నారు. వారు పనుల నిమత్తం వారిదగ్గర వున్న ఫోన్ ను బాలుడి చేతికిచ్చి తల్లదండ్రులు పని చేసుకునేవారు. అలా ఆ బాలుడు ఫోన్లో ఆన్లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. వారు పనిచేస్తున్న సమయంలో.. ఒళ్లు తెలియకుండా ఫోన్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాడు. ఆక్షణంలో పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. ఆబాలుడు అదికూడా గమనించకుండా.. బాలుడు గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అయితే కొద్ది క్షణాల్లోనే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అది గుర్తించిన ఆ ఇటుక బట్టీ యజమాని ఆస్పత్రికి తరలించినా.. ప్రయోజనం లేకపోయింది. బాలుడికి చికిత్స చేస్తుండంగానే మృతి చెందాడు. చందన్నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Ganapathi special pooja Live: ఇష్టకామ్యాలను ప్రసాదించే ఉచ్చిష్ట గణపతికి వెలగపండ్ల అర్చన