Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీఆర్ఎస్ చురుగ్గా పాల్గొంటుంది. సీఎం కేసీఆర్ ప్రతిరోజూ నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు హాజరవుతుండగా, మంత్రులు హరీశ్, కేటీఆర్, కవితలు పలు నియోజకవర్గాలు, కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడుతున్నారు. మంత్రి కేటీఆర్ తన తొమ్మిదిన్నరేళ్ల పాలనను ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. బిజినెస్ నెట్‌వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్‌ఐ) శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ఆయన మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తాను తీసుకునే శాఖ విషయమై కీలక కామెంట్స్ చేశారు. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టూరిజం శాఖ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరతానని కేటీఆర్ వెల్లడించారు. దీంతో సీఎం పదవి వద్దంటూ టూరిజం శాఖ కావాలని కేటీఆర్ చెప్పడం ఆశక్తి కరంగామారింది. సీఎం కేసీఆర్ కొడుకు అయి వుంది.. ఆయన బాటలో నడవాల్సిన కేటీఆర్ సీఎం పదవి కాకుండా.. టూరిజం శాఖ కావాలనడంపై సర్వత్రా ఆశక్తి కరంగా మారింది. ఆరు దశాబ్దాల్లో కాంగ్రెస్ సాధించలేని అభివృద్ధిని తమ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో సాధించిందన్నారు. తెలంగాణలో పర్యాటక రంగానికి అపారమైన అవకాశాలున్నాయని, పెద్దఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత మరింత మెరుగుపడిందన్నారు.
Read also: Nomination Candidates: అభ్యర్థుల నామినేషన్లలో ‘వి’చిత్రాలు.. అసలు పేరు ఒకటి వాడుకలో మరొకటి
తెలంగాణలో వైద్య, ఆధ్యాత్మిక, క్రీడలు, అటవీ పర్యాటక రంగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ వారాంతపు విశ్రాంతి కేంద్రాలను అభివృద్ధి చేయాలి. పర్యావరణానికి హాని కలగకుండా గండిపేట, హిమాయత్‌సాగర్‌లలో కూడా పర్యాటకులకు సౌకర్యాలు కల్పించాలి. మూతపడిన పరిశ్రమల సాంకేతిక-ఆర్థిక అంశాలను విశ్లేషించడానికి, బ్యాంకులతో మాట్లాడటానికి మరియు క్రెడిట్ సౌకర్యాలను పునర్నిర్మించడానికి ఒక ప్రత్యేక పారిశ్రామిక అభివృద్ధి విభాగం ఏర్పాటు చేయబడింది. కాంగ్రెస్ హయాంలో తీవ్ర కరెంటు కోతలు, నీటి కష్టాలు ఉండేవి. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని సమస్యలను అధిగమించి సర్వతోముఖాభివృద్ధి సాధించింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో, బీజేపీ ఎంపీ సన్నీడియోల్ హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో గుర్తించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఫాక్స్‌కాన్ అధినేత యాంగ్‌లీ హైదరాబాద్‌ను చూసి భారత్‌లా కనిపించడం లేదన్నారు. భాగ్యనగరం సాధించిన ప్రగతికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Guntur kaaram :పెరుగుతున్న ధమ్ మసాలా సాంగ్ క్రేజ్.. ప్లాన్ చేంజ్ చేసిన మేకర్స్..?