HYDRA : హైడ్రా హడావిడి.. 2 గంటల్లో ఇళ్లు ఖాళీ చేయండి..! ఐలాపూర్‌లో నివాసితుల కన్నీళ్లు
- అక్రమ నిర్మాణంపై హైడ్రా యాక్షన్
- 2 గంటల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు
- లిఫ్ట్‌లు ఆఫ్.. సామాన్ల తరలింపులో ఇబ్బందులు
- బాధితుల ఆవేదన.. ముందస్తు సమాచారం లేదని ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా (HYDRAA) చేపట్టిన కూల్చివేతల చర్యలు ఉద్రిక్తతకు , నివాసితుల కన్నీళ్లకు దారితీశాయి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయించే ప్రక్రియను శనివారం చేపట్టింది. ఈ క్రమంలో కేవలం రెండు గంటల సమయం మాత్రమే కేటాయించడంతో అక్కడ నివసిస్తున్న అద్దెదారులు (Renters) తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల ఆదేశాలతో తమ సామాన్లు సర్దుకోవడానికి నివాసితులు హుటాహుటిన ప్రయత్నించినప్పటికీ, అత్యల్ప సమయం ఉండటంతో వారు సతమతమవుతున్నారు.
Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..
Also Read
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
కూల్చివేతకు ముందే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ట్రాన్స్ఫార్మర్ను తొలగించడంతో అపార్ట్మెంట్లోని లిఫ్టులు నిలిచిపోయాయి. దీనివల్ల 5వ అంతస్తులో నివసిస్తున్న వారు సోఫాలు, బెడ్ కాట్లు, వాషింగ్ మిషన్లు వంటి బరువైన వస్తువులను మెట్ల ద్వారా మోసుకురావాల్సి వస్తోంది. ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ వంటి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ తరలింపులో పాడైపోతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, అకస్మాత్తుగా ఖాళీ చేయాల్సి రావడంతో ప్యాకర్స్ అండ్ మూవర్స్ కూడా దొరకడం లేదని, ఒకవేళ దొరికినా విపరీతమైన డిమాండ్ కారణంగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని నివాసితులు వాపోతున్నారు.
Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..
ముందస్తు సమాచారం ఏమీ లేకుండానే నేరుగా వచ్చి ఖాళీ చేయాలని చెప్పడం వల్ల తాము ఆర్థికంగా, మానసికగా తీవ్రంగా నష్టపోతున్నామని అద్దెదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కఠిన చర్యల వల్ల అక్రమంగా నిర్మించిన బిల్డర్ల కంటే, నమ్ముకుని నివసిస్తున్న సామాన్యులే బలి అవుతున్నారని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఆహ్వానించదగ్గదే అయినా, నివాసితులకు కనీస సమయం ఇవ్వకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!