Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coconut Rice: ఉదయాన్ని పిల్లలకు, ఆఫీస్ వెళ్లే వాళ్లకు లంచ్ బాక్స్ రెడీ చేయడం ఆడవాళ్లకు పెద్ద సవాల్. సమయా భావం, హెల్త్ రెండూ సమానంగా ఉండేలా రెసిపీలు చేయాల్సి ఉంటుంది. అలాంటి టప్పుడు ఏం చేయాలో తోచదు. అయితే.. తక్కువ సమయంలో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండేలా ఓ లంచ్ రెసిపీ మీ కోసం.. దక్షిణ భారత దేశంలో పండుగలు, శుభకార్యాల సమయంలో అత్యంత ప్రీతిపాత్రంగా చేసుకునే వంటకాల్లో కొబ్బరి అన్నం (Coconut Rice) ఒకటి. పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, అల్లం మరియు ఇంగువ సువాసనలతో ఈ అన్నం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం..
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1 కప్పు (వండనివి) లేదా 3-4 కప్పుల వండిన అన్నం
పచ్చి కొబ్బరి తురుము: 1 నుంచి 1½ కప్పు (తాజాదైతే రుచి ఇంకా బాగుంటుంది)
నెయ్యి లేదా నూనె: 2 టేబుల్ స్పూన్లు
తాలింపు దినుసులు: ½ టీస్పూన్ ఆవాలు, ½ టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ½ టేబుల్ స్పూన్ మినప్పప్పు
నట్స్: 12-15 జీడిపప్పులు లేదా వేరుశనగ గుళ్లు
పచ్చిమిర్చి: 1-2 (చీలికలు)
ఎండుమిర్చి: 1
అల్లం: 1 టీస్పూన్ (సన్నని తరుగు)
కరివేపాకు: 1 రెమ్మ
ఇంగువ: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని కడిగి పొడిపొడిగా వండుకోవాలి. అన్నం మెత్తగా అవ్వకుండా గింజ గింజలా ఉండేలా చూసుకోవాలి. వండిన అన్నాన్ని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం.. బాణలిలో నెయ్యి లేదా నూనె వేడి చేసి, మొదట జీడిపప్పు లేదా వేరుశనగ గుళ్లను బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు వేయాలి. పప్పులు దోరగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు.. అల్లం తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి వేయించాలి. చివరగా చిటికెడు ఇంగువ వేయాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వెంటనే వండిన అన్నాన్ని కూడా వేసి బాగా కలపాలి. (మీరు ఫ్రోజన్ కొబ్బరి వాడుతుంటే, కొబ్బరి వేడి అయ్యాక అన్నం కలపండి). అన్నీ బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేయాలి. పైన ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను చల్లుకోవాలి. ఈ కమ్మని కొబ్బరి అన్నాన్ని ఏదైనా కుర్మాతో గానీ, లేదా కేవలం పెరుగుతో గానీ వడ్డిస్తే చాలా రుచిగా ఉంటుంది.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!