HYDRA : నగరం నలువైపులా హైడ్రా ఆపరేషన్స్.. భారీగా ఆక్రమణల తొలగింపు
- హైదరాబాద్ నలువైపులా హైడ్రా ఆపరేషన్స్
- భారీగా ఆక్రమణల తొలగింపు
- మంచిరేవుల నాగిరెడ్డి కుంటచెరువు దగ్గర కబ్జాలు తొలగించిన హైడ్రా
- రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలపై హైడ్రా చర్యలు
- స్థానికుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా (Hyderabad Disaster Response and Assets Protection Agency) తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్ ఎస్టేట్ మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు వద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్న భారీ అక్రమాలను హైడ్రా అడ్డుకుంది. చెరువు ఉనికిని మాయం చేసేందుకు చుట్టూ టిన్ షీట్లు కప్పి లోపల కబ్జా చేసే ప్రయత్నాన్ని అధికారులు భగ్నం చేశారు. అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించి, చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వానికి చెందిన చెరువు స్థలం అని తెలియజేస్తూ హైడ్రా బోర్డులను ప్రతిష్టించారు.
పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!
Also Read
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కారణమవుతున్న గండిమైసమ్మ–మియాపూర్ ప్రధాన రహదారిపై హైడ్రా కీలక చర్యలు తీసుకుంది. 150 ఫీట్ల వెడల్పు ఉండాల్సిన ఈ రహదారిని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన 10 షాపులను అధికారులు కూల్చివేశారు. ఈ ఆక్రమణల వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. అయితే, ఈ కూల్చివేతలు ఆకస్మికంగా కాకుండా, రెండు నెలల ముందే నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు హైడ్రా వెల్లడించింది. దీనితో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?
ఘటకేసర్ పరిధిలోని అవుషాపూర్‌లో 1440 గజాల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా రక్షించింది. ఒక లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు అక్రమార్కులు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న హైడ్రా బృందం వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించింది. ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి, ఇది ప్రభుత్వ పార్కు స్థలమని బోర్డులు ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!