Eric Garcetti: ఇరానీ చాయ్ టేస్ట్ చూసిన అమెరికా రాయబారి.. హైదరాబాద్ అంటేనే చార్మినార్ అని ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eric Garcetti: భారతదేశానికి కొత్తగా నియమితులైన అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్ నగరాన్ని ఆస్వాదిస్తున్నారు. తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఎరిక్ హైదరాబాద్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా హైదరాబాద్ ఐకానిక్ చార్మినార్ పై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఓల్డ్ సిటీలో ఇరానీ చాయ్ రుచిని ఆస్వాదించారు. హైదరాబాద్ లో ఫేమస్ నిమ్రా కేఫ్ లో ఇరానీ చాయ్ టేస్ట్ చేశారు. ఇరానీ చాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్లను టేస్ట్ చేస్తూ.. వెనకాల చార్మినార్ ఉన్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
హైదరాబాద్ ను చార్మినార్ లాగా ఏదీ సూచించదు.. ఇది తెలంగాణ స్మారక చిహ్నాన్ని చూడటం సులభం. 500 ఏళ్ల హిస్టరీ, ఓల్డ్ సిటి అందాలు, ఇది చారిత్రాత్మక నగారానికి ఉత్కంఠభరితమైన నిదర్శనమని, చాయ్ బాగుందని అని ట్వీట్ చేశారు. ఇటీవల ఎరిక్ గార్సెట్టి భారత్ కు అమెరికా 26వ రాయబారిగా నియమితులయ్యారు.
Also Read
Read Also: Supreme Court: కోర్టులు నైతికత, నీతిని బోధించే స్థలం కాదు.. మహిళ అక్రమసంబంధం కేసులో కీలక వ్యాఖ్యలు..
దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఆయన సందర్శించాడానికి హైదరాబాద్ లో మరిన్ని స్థలాలను సూచించారు. ‘‘సాయంత్రం చాయ్ అండ్ బిస్కెట్, భోజనానికి ప్యారడైస్ బిర్యానీ, చల్లని బీర్ తో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో తెలుగు సినిమా చూస్తున్నారు.. చక్కని వినోదం’’ అని కామెంట్ చేశారు. మరొకరు భారతదేశం మిమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూస్తుందని రాశారు.
అమెరికా 247వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ ను ఒక రోజు ముందు ఆయన ప్రారంభించారు. రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన హైదరాబాద్ లో పర్యటించారు. చార్మినార్ తర్వాత, చౌమహల్లా ప్యాలెస్ ను కూడా సందర్శించారు. టిహబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇలా పలు ప్రాంతాల్లో పర్యటించారు. లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్లో 12 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, రాయబారి గార్సెట్టి 2013లో జరిగిన ఎన్నికలలో అతి పిన్న వయస్కుడిగా గెలుపొందారు. మేడ11, 2023న ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ద్వారా భారతదేశంలో 26వ US రాయబారిగా నియమితులయ్యారు.
Nothing symbolizes #Hyderabad quite like #Charminar and it’s easy to see why it stands as #Telangana’s most iconic monument. From its 500-year history to its beautiful views of the Old City, it’s a breathtaking testament to this historic city. Oh yes, and the chai was great too! pic.twitter.com/uzJYrRNebH
— U.S. Ambassador to India (@USAmbIndia) May 27, 2023
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!