Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు!
- బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
- బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..
- గతవారం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చింది..
- కేంద్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ను ఇంకా పరిశీలించలేదు..
- బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ఏవిధంగా నష్టం జరుగుతుందో..
- కేంద్రానికి లేఖ రాయాలని సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.. ఎందుకు బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలనే దానిపై పూర్తి వివరాలతో జల వనరుల శాఖను కలవాలి అని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే, గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ ఇచ్చిందని అన్నారు. కేంద్రం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదు.. బనకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవలేదు.. అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుంది.. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: ECI: రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం..
Also Read
రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎలిజిబిలిటీ వచ్చింది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.. నేను మరోసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండను.. సేవ్ తెలంగాణ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుంది.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తాం అన్నారు. బీజేపీ నేతగా ఈటల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లలేదు.. గత ఆర్థిక మంత్రిగా ఈటల విచారణకు వెళ్లారు.. బీజేపీ స్టాండ్ చెప్పాలని కమిషన్ అడగలేదు.. ఆర్థిక మంత్రిగా ఏం జరిగిందో ఈటల కమిషన్ ముందు వివరించారు.. ఇక, తుమ్మల నాగేశ్వర్ రావు ఆల్ పార్టీ మంత్రి.. బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో మంత్రిగా పని చేశారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..