Site icon NTV Telugu

Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు!

Banakacharla

Banakacharla

Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.. ఎందుకు బనకచర్ల ప్రాజెక్టును నిలిపి వేయాలనే దానిపై పూర్తి వివరాలతో జల వనరుల శాఖను కలవాలి అని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకి ఏ విధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు చేశారు. అయితే, గత వారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ ఇచ్చిందని అన్నారు. కేంద్రం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదు.. బనకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవలేదు.. అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుంది.. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని కిషన్ రెడ్డి తెలిపారు.

Read Also: ECI: రాహుల్ గాంధీ ‘‘రిగ్గింగ్’’ కామెంట్స్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం..

రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు ఎలిజిబిలిటీ వచ్చింది అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలో అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.. నేను మరోసారి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండను.. సేవ్ తెలంగాణ నినాదంతో బీజేపీ ముందుకు వెళ్తుంది.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తాం అన్నారు. బీజేపీ నేతగా ఈటల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లలేదు.. గత ఆర్థిక మంత్రిగా ఈటల విచారణకు వెళ్లారు.. బీజేపీ స్టాండ్ చెప్పాలని కమిషన్ అడగలేదు.. ఆర్థిక మంత్రిగా ఏం జరిగిందో ఈటల కమిషన్ ముందు వివరించారు.. ఇక, తుమ్మల నాగేశ్వర్ రావు ఆల్ పార్టీ మంత్రి.. బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో మంత్రిగా పని చేశారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Exit mobile version