ఉప్పల్ భగాయత్ మూడో దశ వేలంలోనూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఊహించని రీతిలో కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు దాటేస్తూ మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01లక్షల చొప్పున ధర పలకడం గమనార్హం. మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ…