వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమిలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఓ ల్యాండ్ ఇష్యూకు సంబంధించి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana High Court: ప్రభుత్వ భూములని ప్రైవేట్ భూములుగా రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఎటువంటి ముందస్తు అనుమతి అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు ప్రముఖ న్యాయవాది సుంకర నరేష్ స్పష్టం చేశారు. కాప్రా మాజీ తహశీల్దార్ ఎస్తేర్ అనిత, మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కాప్రా మండల సర్వేయర్ శ్రీష్మా, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు శాలిని, పొనుగుబాటి విశ్వనాధ్ లపై కేసు నమోదు చేయాలని…
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా…
Daggubati Family: మొట్ట మొదటిసారి దగ్గుబాటి ఫ్యామిలీ వివాదంలో చిక్కుకొంది. ఇప్పటివరకు సినిమాలు, కుటుంబం తప్ప బయట ఏ వివాదంలోనూ ఇరుక్కొని వెంకటేష్ భూ వివాదంలో ఇరుక్కున్నారు.
ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.