తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు (జనవరి27) సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఎండీని కలిసి సమ్మె నోటీసులు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు. ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ.. శుక్ర, శనివారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు…
తెలంగాణ ఆర్టీసీలో భర్తీ చేసే ఉద్యోగాలపై ఎండీ వీసీ సజ్జనార్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరిట ఆన్‌లైన్‌లో వస్తున్న లింకులను నమ్మవద్దని ఆయన కోరారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎండీ వీసీ సజ్జనార్ కీలక అలర్ట్ ఇచ్చారు.
ఏపీలో మరో బాదుడు మొదలైంది. ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వల్ల ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయిందన్నారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీకి లాభాలు లేకుండా.. కనీసం ఆర్టీసీ బస్సులు నిర్వహించేందుకు వీలుగానే ఛార్జీల సవరణ వుంటుందన్నారు MD ద్వారకా తిరుమలరావు. ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి వచ్చింది. డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం. పల్లె వెలుగు బస్సుల్లో రూ.2 పెంచుతున్నాం. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నాం. పల్లె వెలుగు బస్సులో రేపట్నుంచి కనిష్ఠ…
హైదరాబాద్ మెట్రో రైలులో ఓ గర్భిణీ మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే కామెంట్లను పెడుతున్నారు. మనిషి అన్న తర్వాత ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. Read Also: షర్మిల…
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీపీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ లో శుక్రవారం సజ్జనార్ ఎండీ గా బాధ్యతలు చేపట్టారు. సజ్జనార్ అంతకు ముందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు. 2009 లో దేశం లోనే సంచలనం…