Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటన… పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..
- సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం..
- ఇది సాధారణ ఘటన కాదని, 54మంది కార్మికలు చనిపోయారన్న సీజే..
- ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటని ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డికి ప్రశ్న..
- 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటి వరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు..
- ఇప్పటివరకు ఘటనకు బాధ్యులెవరనీ తేల్చలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: సిగాచీ పేలుళ్ల ఘటనపై పోలీసులు చేపట్టిన దర్యాప్తు పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని, ఒకేసారి 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన దారుణం అని సీఎస్ జస్టిస్ వ్యాఖ్యానించారు. ఇదేనా దర్యాప్తు? 5 నెలలు గడిచినా పురోగతి ఏమీ లేదు” అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది అంటే మాటలు ఏమిటి?.. ఇంత పెద్ద ప్రమాదంలో బాధ్యత ఎవరికో ఇప్పటికీ నిర్ధారణ కాలేదా? అంటూ ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డిని కోర్టు ప్రశ్నించింది.
Read Also: Cyclone Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్.. ‘దిత్వా’గా నామకరణం.. ఏపీకి భారీ వర్ష సూచన..
Also Read
DSP కి దర్యాప్తు ఎందుకు? SIT ఎందుకు కాదు?
ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాల్సిందిగా కోర్టు వ్యాఖ్యానించింది. 54 మంది చనిపోయినా.. DSP స్థాయి అధికారి దర్యాప్తు చేయడం ఎలా సమంజసం?” అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఇది అత్యంత తీవ్రమైన నిర్లక్ష్యం అని ప్రజాప్రయోజన వ్యాజ్య పిటిషనర్ బాబు రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 237 మందిని విచారించినా దర్యాప్తులో పురోగతి లేదు.. నిపుణుల కమిటీ పరిశీలనలో ఫ్యాక్టరీ నిర్వహణలో ఘోర లోపాలు తేలాయి.. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేశారు.. పేలుడు తీవ్రతకు 8 మంది శరీరాలు ఆనవాళ్లు లేకుండా కాలిపోయాయని గుర్తు చేసింది..
ప్రభుత్వ వైఖరిపై కోర్టు ప్రశ్నలు
ఏఏజీ ప్రభుత్వం నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని కోర్టుకు తెలియజేశారు. దానికి కోర్టు స్పందిస్తూ ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పడం సరిపోదు అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. దర్యాప్తు నివేదికను వెంటనే సమర్పించాలి.. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి DSP స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేస్తూ.. తదుపరి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు..
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!