Big Breaking: తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. నేడు (మంగళవారం) అభ్యర్థులందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లను ఖరారు చేస్తారనే ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించలేని విధంగా డీఎస్సీ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ల కౌన్సెలింగ్ వాయిదా పడిందని, తదుపరి కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. దీంతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ అనంతరం పోస్టింగ్ వస్తుందని భావించారు. కానీ, ఇవాళ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో విద్యాశాఖ వాయిదా ప్రకటన రావడంతో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Read also: Harish Rao: మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు..
ఇక మరోవైపు ఇవాళ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై ఉత్కంఠకు నేటితో తెరపడే అవకాశం ఉంది. 7 ప్రశ్నలు తప్పుగా ఉన్నందున పరీక్షను రద్దు చేయాలని 10 మందికి పైగా అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై నేడు (మంగళవారం) హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే పలు పిటిషన్లపై విచారణను పూర్తి చేసిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 21 నుంచి అంటే మరో 6 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది. ఈ తీర్పుపైనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Atrocious On Minor: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై హత్యాయత్నం