అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసిన మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తో అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముందు అభ్యర్థులు ఆందోళన చేశారు.