విచారణలో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో డ్రగ్ డీలర్ టోనిని విచారించి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెనుదిరిగారు. మూడు గంటల పాటు టోని ని టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారించారు. విచారణకు సహకరిస్తున్న టోనిని ప్రధానంగా మనీ ట్రాన్సక్షన్స్ పై ప్రశ్నలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అడిగారు. టోనికి బ్యాంక్ అకౌంట్ ద్వారా మనీ ట్రాన్సక్షన్స్ జరగలేదని స్పష్టతకు వచ్చిన పోలీసులు.. తన మిత్రుడు A2 ఇమ్రాన్ అకౌంట్ ద్వారా టోనీ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలు చేసిన వ్యాపారవేత్తలు A2 ఇమ్రాన్ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.
ఓ నైజీరియన్ వెళ్తూ వెళ్తూ తన బిజినెస్ ను టోని కి అప్పగించి వెల్లునట్టు గుర్తించిన పోలీసులు.. డ్రగ్స్ సప్లై ద్వారా అధిక మొత్తం సంపాదించవచ్చని ఆ నైజీరియన్ చెప్పినట్లు విచారణలో తేలిందన్నారు. దీంతో 2013 నుండి డ్రగ్స్ స్మగ్లింగ్ టోనీ చేస్తున్నట్లు, ఇమ్రాన్ అకౌంట్ నుండి ఆ డబ్బు టోనికి చేరుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఈ డ్రగ్స్ కేసులో ఏడుగురు వ్యాపారవేత్తలు అరెస్ట్ అయ్యారు. వీరు చంచల్ గూడ జైలులో ఉన్నారు.. మరో నలుగురు బడా వ్యాపారవేత్తలు, ఐదుగురు కొరియర్ బాయ్స్ పరారీ లో ఉన్నారు..