Harish Rao: ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు..
- కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదు..
- ఏడు నెలల్లో తెలంగాణలో పల్లెలన్ని మురికి కూపాలుగా మారాయి..
- గ్రామపంచాయితీలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుకు సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ఏడు నెలల్లో తెలంగాణలో పల్లెలన్ని మురికి కూపాలుగా మారాయన్నారు. గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాల మీద కుట్రలు చేసి ప్రతికారం తీర్చుకోవడానికి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Khammam: సత్తుపల్లి వన మహోత్సవ కార్యక్రమం.. పాల్గొన్న మంత్రులు..
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంటే ఇక్కడి సీఎంకి రెండు వేలు ఇవ్వడం కూడా చేత కావడం లేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోనే బీఆర్ఎస్ పార్టీకి దుబ్బాకలో అత్యధిక మెజార్టీ వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తు చేశారు. సీఎం సొంత జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగాడని ఇప్పుడే తెలిసిందని మండిపడ్డారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి గెలుపోటములు కామన్ అన్నారు. కాలం ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది.. ఎన్నికలు రాక తప్పదు బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదని తెలిపారు.
Read also: 35 Chinna Katha Kadhu: ఇదో మా సిన్న కుటుంబం తొలి సూపు అంటూన్న నివేదా థామస్..
ఇక మరోవైపు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ట్విటర్ వేదికగా ఖండించారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.? అన్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి అని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామన్నారు.
Real Estate: యవతిపై ఇద్దరు రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల అత్యాచార యత్నం..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!