NTV Telugu Site icon

KTR Tweet: వ్యవసాయానికి గడ్డుకాలం..ఎక్స్‌ వేదిగా కేటీఆర్‌ ట్వీట్‌

Ktr Tweet

Ktr Tweet

KTR Tweet: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో ఏడాది కాలంలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. దేశానికి ఆదాయ అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో ఎనిమిది నెలల్లో ఇంత విధ్వంసం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భద్రత లేదని విమర్శించారు. బురద రాజకీయాలకు అతీతంగా సకాలంలో సాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదన్నారు. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు అన్నదాతల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

Read also: Pregnant Cars: ఇదేందయ్యా ఇది.. కార్లేంటి ఇలా అయిపోయాయి..

కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం.. అన్నారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్.. తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే.. ఢమాల్ అని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం.. ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం..! అన్నారు. దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో.. ఎనిమిది నెలల్లోనే.. ఎందుకింత వ్యవసాయ విధ్వంసం..? అని ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో.. ఎందుకింత సంక్షోభం..?? అన్నారు. మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్,,
నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అంటూ విమర్శించారు. రుణమాఫీ అని మభ్య పెట్టి.. పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే.. రైతులకు ఈ అవస్థ.. అన్నారు. రూ.500 బోనస్ అని.. నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ.. అన్నారు.

Read also: Committee Kurrollu: త్వరలోనే ‘కమిటీ కుర్రోళ్లు’ చూస్తా: మహేష్ బాబు

ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదని విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు.. అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి..అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు..రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు..చెరువులకు మళ్లించే తెలివి లేదన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో.. రైతు బతుకుకు భరోసానే లేదని మండిపడ్డారు. బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదని తెలిపారు. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు.. క్యూలైన్ లో పాసుబుక్కులు, చెప్పులు.. అన్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే.. పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులన్నారు. అప్పుల బాధతో..అన్నదాతల ఆత్మహత్యలు.. కౌలు రైతుల బలవన్మరణాలు.. ఇలా.. ఒకటా.. రెండా.. సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు.. సవాలక్ష !! అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.
Nagarjuna Sagar: సాగర్ కు కొనసాగుతున్న వరద.. 18 గేట్లు ఎత్తివేత..

Show comments