Nagarjuna Sagar: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువలకు వదులుతున్నారు. 18 గేట్లు ఐదు అడుగులు మేర పైకి ఎత్తి క్రస్ట్ గేట్ల ద్వారా 1,43,518 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. ఇన్ ఫ్లో : 1,87,716 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 1,87,716 క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రస్తుత నీటి మట్టం : 588.80 అడుగులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 308.4658 కాగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.5050లుగా కొనసాగుతుంది.
Read also: CM Revanth Reddy: సౌత్ కొరియాలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు
ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో నాగార్జున సాగర్ డ్యామ్ వద్దకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. అనంతరం శాంతిసిరి, నాగసిరి లాంచీల్లోని నాగార్జున కొండకు పర్యాటకులు తరలివెళ్లారు. ఓ వైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు సందడి చేశారు.
Read also: Heavy Rains: హైదరాబాద్ లో జోరువాన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
అయితే నాగార్జునసాగర్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కావడంతో సాగర్ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలిరావడంతో ప్రధాన డ్యాం, పవర్ హౌస్ పరిసరాల్లోకి పర్యాటకులు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు మీడియాపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. సాగర్ వద్ద పోలీసుల సూచన మేరకు నాగార్జున ఇలా వ్యవహరిస్తున్నాడని ప్రేక్షకులు అంటున్నారు. ఇబ్బందులకు గురిచేస్తున్నారని అంటున్నారు. మరోవైపు చిన్న పిల్లలతో వచ్చే వారు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు ఎండ, మరోవైపు ట్రాఫిక్ కారణంగా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!