SOT Police Raid: కోహినూరు సంస్థలో ఎస్ఓటి సోదాలు.. అదుపులో సంస్థ యజమాని..
- హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని కోహినూరు సంస్థలో ఎస్ఓటి సోదాలు..
- ముడి సరుకులతో పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న కోహినూరు సంస్థ..
- కోహినూరు సంస్థ యజమాని గజేందర్ సింగ్ అరెస్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SOT Police Raid: హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని కోహినూరు సంస్థలో ఎస్ఓటి సోదాలు నిర్వహించారు. కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై ఎస్ఓటి దాడులు చేపట్టారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. కోహినూరు సంస్థ ముడి సరుకులతో పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోహినూరు సంస్థ యజమాని గజేందర్ సింగ్ ను ఎస్ఓటి అదుపులో తీసుకున్నారు. సుమారు 300 కేజీల పన్నీరు స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్ తో కళాఖన్ స్వీటు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వనస్పతి, పామాయిల్ తో కలిపి కళాకాన్ , పన్నీరు పాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. పాల ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున నిల్వచేసిన ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. కోహినూర్, శ్రీకృష్ణ బ్రాండ్‌లతో బేగంబజార్ సెంటర్‌లోని పలు టీ స్టాళ్లు, 50 హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్‌హౌస్‌లకు గజేందర్‌సింగ్ అనే వ్యాపారి ఈ నకిలీ పాలను సరఫరా చేస్తున్నాడు. పాలతో పాటు పెరుగు, వెన్న, ఐస్‌క్రీం కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుసుకున్న SWOT పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Read also: Maoist Leader: మవోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో రూ.కోటి రివార్డు వున్న అగ్రనేత..
Also Read
ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీతో పాటు ఇతర సహకార, ప్రైవేట్ డెయిరీలు తరచూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నాయి. పేరున్న కంపెనీల పేరుతో ప్యాకెట్లు సృష్టించి నకిలీ పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. విజయ డెయిరీ పేరుతో కొన్ని నకిలీ కంపెనీలు పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని ఆ సంస్థ ఐదారుసార్లు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఏయే సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయో స్పష్టంగా పేర్కొన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోపాటు యథేచ్ఛగా నకిలీ దందా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు, రాజధాని పరిసర జిల్లాల్లో ఈ నకిలీ దందా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఈ నకిలీ దందా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నకిలీ మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ల కోసం రెక్లా షెడ్లను యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్నారు.
KTR Viral Tweet: పైసా పనిలేదు రాష్ట్రానికి లాభం లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..
తాజావార్తలు
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?