Maoist Leader: మవోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ.. పోలీసుల అదుపులో రూ.కోటి రివార్డు వున్న అగ్రనేత..
- సుక్మా లో మావోయిస్టు కీలక నేత పట్టివేత..
- మహిళా నక్సలైట్ సుజాతను పట్టుకున్న తెలంగాణ పోలీస్..
- సుజాత మీద కోటి రూపాయల పైగా రివార్డు ఉన్నట్లు గుర్తింపు..
- సుజాత విచారిస్తున్న పోలీసులు..
- ఖమ్మంలోని ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వస్తుండగా పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoist Leader: మావోయిస్టు కీలక నేత మహిళా నక్సలైట్ కల్పన అలియాస్ సుజాతను అరెస్ట్ చేశారు. సుజాత మీద కోటి రూపాయల పైగా రివార్డు ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మంలోని ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుండగా పట్టుకున్నారు. సుజాత అదుపులో తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం సుజాత సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆమె కేంద్ర కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కల్పన అలియాస్ సుజాత తోపాటు మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయిలను అదుపులోకి తీసుకున్నారు. సుజాత భర్త కిషన్‌జీ 2011లో పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లోని బురిషోల్‌లో జరిగిన కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యునిగా పని చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.
Read also: Nagarjuna Sagar: సాగర్ కు భారీగా వరద.. 8 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..
Also Read
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
- Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
- Khammam Cyber Fraud : రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. ఖమ్మం కేసులో SIT ఎంట్రీ
కిషన్ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. కిషన్ జీ భార్య సుజాత కూడా మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ మరణించినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెకు ఇప్పుడు 60 ఏళ్లు. సుజాతపై పోలీసులు రూ.కోటి రివార్డు కూడా ప్రకటించారు. మరోవైపు దండకారణ్యం, అబూజ్ మఢ్ అడవుల్లో ఇటీవల పోలీసులు, భద్రతా బలగాల నిర్భందం పెరిగాయి. ఈనేపథ్యంలో సుజాత మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని కొత్తగూడెం ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సుజాత స్వయంగా లొంగిపోయిందా లేదా సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారా అనేది స్పష్టంగా తెలియరాలేదు.
KTR Meeting: కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ సమావేశం.. అనంతరం గ్రూప్ వన్ అభ్యర్థులతో మీట్..
తాజావార్తలు
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!