Site icon NTV Telugu

RTA Raids: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కొనసాగుతున్న తనిఖీలు..

Rta

Rta

RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, కోదాడ, కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. శంషాబాద్, వనస్థలిపూరం, గగన్ పహాడ్, అల్విన్ చౌరస్తా, ముంబాయి హైవేపై తనిఖీలు చేస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, నాగాల్యాండ్, ముంబై నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి వాహనాన్ని అధికారులు చెక్ చేస్తున్నారు.

Read Also: Gujarat Honour Killing: తల్లి, తోడబుట్టిన అన్న కలిసి.. కుమార్తెను ఏం చేశారో తెలుసా..

ఇక, బస్సుకు సంబంధించిన ఆర్సీ, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్‌సి, ఫిట్‌నెస్, బీమా, పర్మిట్, పన్ను, డబుల్ డ్రైవర్, ఎస్కార్ట్ ఫైర్ ఎక్స్‌టింజిషర్ తో పాటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ లను క్షుణ్ణంగా రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగుతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన తరువాత ఆర్టీఏ అధికారులు కళ్లు తెరిచారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ప్రాణాలు పోయిన తరువాత అధికార యంత్రాంగం రెండు మూడు రోజులు హడావుడి చేయడం తప్పా అంతా షరా మాములే అంటున్నారు ప్రయాణీకులు.

Exit mobile version