TG DSC 2024: తెలంగాణ డీఎస్సీలో ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు డీఎస్సీ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. రెండు పరీక్షలు ఒకే చోట రాసే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులు ఉదయం మొదటి పరీక్ష రాసిన కేంద్రంలోనే మధ్యాహ్నం రెండో పరీక్షకు హాజరయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అభ్యర్థులకు అధికారులు సమాచారం అందించారు. అలాంటి వారి కోసం హాల్ టిక్కెట్లు మారుస్తామని అధికారులు స్పష్టం చేశారు. చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో మొదటి పరీక్ష ఉదయం ఒక జిల్లాలో, రెండో పరీక్ష మధ్యాహ్నం మరో జిల్లాలో జరిగింది. కేటాయించిన పరీక్షా కేంద్రాలు దూరంగా ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లగా వారు స్పందించి ఉపశమనం కల్పించారు. డీఎస్సీ పరీక్షలు ఈ నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభం కానున్నాయి.
Read also: Nigeria : కూలిన రెండంతస్తుల పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థులు మృతి, 132 మందికి గాయాలు
తెలంగాణ డీఎస్సీ 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ గురువారం రాత్రి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు అందిన దరఖాస్తులు.. రాష్ట్రవ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలకు 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవలే హాల్ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. 11,062 ఉద్యోగాలకు గాను 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
RajtarunLavanya : నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా.