రాజ్ తరుణ్ లావణ్యల కేసు వ్యవహారం వాదోపవాదనలు, ఆరోపణలతో డైలీ సీరియల్ లా సాగుతోంది. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, డ్రగ్స్ కేసులో ఇరికించి, ప్రస్తుతం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో లివింగ్ రేలేషన్ లో ఉంటూ, నన్ను దూరం పెట్టాడని, నాకు మిరే న్యాయం చేయాలని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య.
కాగా లావణ్య కాల్ చేసి బెదిరిస్తోంది, మా అన్నయ్యకు అసభ్యకరమైన మెసేజ్ లు కాల్స్ చేస్తుందని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో లావణ్యపై కేసు నమోదు చేసింది హీరోయిన్ మాల్వి మల్హోత్రా. మరోవైపు లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది, ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది. డబ్బుకోసమే ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్.
ఇదిలా ఉండగా రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారంలో అర్ధరాత్రి మరో హైడ్రామా నడిచింది. రాజ్ లేని లైఫ్ ఊహించుకోలేను, ఇక ఈ లోకంలో ఉండలేను, వ్యవస్థలపై గౌరవం ఉంది కానీ ఫెయిల్ అయ్యాను, నాకు తినడానికి తిండి లేదని కన్నీరు పెట్టుకొంటే, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్ర మాయలో పడిపోయి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు అతను నా చావు కోరుకుంటున్నాడు, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నా చావుకు మాల్వి మల్హోత్ర, రాజ్ తరుణ్ కుటుంబ సభ్యులే కారణం, నేను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ డయల్ 112కు కాల్ చేసింది లావణ్య. దింతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు లావణ్య నివాసానికి చేరుకొని, బలవంతంగా ప్రాణాలు తీసుకోవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చజెప్పారు. రాబోయే రోజుల్లో రాజ్ తరుణ్, లావణ్య ల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: Mokshagna : నందమూరి వారసుడి ఎంట్రీ ఇక లాంఛనమే..!