Site icon NTV Telugu

Madhusudhana Chary: తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు..

Brs

Brs

Madhusudhana Chary: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయారు అనే మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి తెలిపారు. ఆయనకు రాజకీయలా పట్ల అవగహన లేదని అర్ధం అవుతుంది.. అతడి మాటలతో ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపాలి అన్నారు. బీజేపీ బీసీని అధ్యక్షుడు చేస్తారని అన్నారు.. జాక్ పాట్ లాగా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు రామచందర్ రావు.. ఇక, ఆయన అడుగు పెట్టగానే రాజా సింగ్ కమలం పార్టీకి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రన మా పార్టీని తక్కువ చేసినట్లు కాదు.. దేశంలో గతం కంటే బీజేపీ స్థానాలు తక్కువ వచ్చాయి.. కానీ, తెలంగాణ సీట్లు పెరుగాయని మాజీ స్పీకర్ మధుసూదన చారి వెల్లడించారు.

Read Also: Patancheru Blast: పాశమైలారం ప్రమాదం: గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

ఇక, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారని బీజేపీని నమ్ముతారు అని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి చెప్పుకొచ్చారు. మాటలల్లో అనేకం చెప్పి, పనుల్లో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ పాలన జరుగుతుంది.. తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఒక్కటే పని చేస్తుంది.. శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎంతో బీజేపీ పోటీ పడుతూ ఉంటుంది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది అర్ధం పర్ధం లేని మాటలు.. ఇక, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మాటల్లో తెలంగాణలో దోపిడీ కొనసాగితుందని తెలుస్తుంది.. మా పార్టీని బాద్నాం చేయడానికి ఈ రెండు పార్టీలు ఒకటవ్వలని చూస్తున్నాయి.. తెలంగాణ ప్రజలకు రాజకీయ పార్టీలపై స్పష్టమైన అవగాహన ఉంది.. రెండు పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను చక్కదిద్దలేదు.. కేసీఆర్ పాలన పునరావృతం కావాలి ప్రజలు అంటున్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణలో లేడని మధుసూధనాచారి తేల్చి చెప్పారు.

Exit mobile version