BRS MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు..
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి పోలీసుల నోటీసులు..
- ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల కేసులో నోటీసులు..
- రేపు మొయినాబాద్ పీఎస్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLC Pochampally: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని మొయినాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైటెక్ సిటీలోని అపర్ణా ఆర్చిడ్స్ లోని ఆయన నివాసానికి వచ్చి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. అలాగే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయం గేటు వద్ద గోడకు పోలీసులు నోటీసు కాఫీ అతికించారు. ఇక, రేపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఆయనకి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Lift Accident: మరో పసిప్రాణాన్ని బలిగొన్న లిఫ్ట్.. నాలుగున్నరేళ్ల చిన్నారి మృతి
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ఇక, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిపై గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4తో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. గతంలోనే ఫామ్ హౌస్ కు సంబంధించిన లీజు డాక్యుమెంట్లు మొయినాబాద్ పోలీసులకు పోచంపల్లి లాయర్లు అందజేశారు. లీజు డాక్యుమెంట్స్ పై కొన్ని అనుమానాలు ఉండడంతో వాటిని నివృత్తి చేసుకునేందుకు మరోసారి పోచంపల్లిని విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు పంపించారు.
తాజావార్తలు
-
Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
-
Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Nara Lokesh: గణేష్ నిమజ్జనం వేళ డీజేలపై స్పందించిన లోకేష్.. హోంమంత్రి, డీజీపీకి విజ్ఞప్తి
-
Asus: Asus Vivobook లైనప్‌లో కొత్త ల్యాప్‌టాప్‌లు.. S14, S16, 14 Flip, S14 Flip, Vivobook 16 లాంచ్
ట్రెండింగ్
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!