Fire Accident: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం.. కీలక ఫైల్స్ దగ్ధం..?
- నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్నిప్రమాదం..
- మొదటి అంతస్తులో భారీగా ఎగసిపడుతున్న మంటలు..
- మంటలను అదుపు చేస్తున్న రెండు ఫైరింజన్లు..
- స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడంతో ఆందోళనలో అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: హైదరాబాద్ మహా నగరంలోని నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఈరోజు (డిసెంబర్ 7న) ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర కలకలం చోటు చేసుకుంది. మంటల ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తుంది. పొగ కమ్మేయడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Read Also: Minister Ramprasad Reddy: క్వాంటమ్ వ్యాలీతో ఇకపై అమరావతి వేగంగా అభివృద్ధి..
Also Read
అయితే, తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కావడం వల్ల అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ల్యాబ్ లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్లోనే కీలక కేసులు సమాచారం. ఇక్కడే ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలుస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్న ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నట్లు సమాచారం. ఫస్ట్ ఫ్లోర్ లో కంప్యూటర్ ల్యాబ్ తో పాటు కీలకమైన గదులు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కీలక ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లోనే పలు కేసుల్లో సేకరించిన పేపర్ వర్క్ ఎవిడెన్స్ సైతం ఇందులోనే ఉన్నాయి. పొగలు పూర్తిగా అదుపులోకి వస్తేనే ఎంత వరకు నష్టం వాటిల్లిందో తెలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?