CM Revanth Reddy: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ అనంతగిరిలో ప్రారంభం అయి.. వాడపల్లి వరకు 240 కిలోమీటర్లు ప్రవహిస్తుంది.. ఈసా, మూసా నదులు బాపూఘాట్ దగ్గర కలుస్తాయి.. అందుకే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాం.. మూసీ ప్రక్షాళనపై నెలల తరబడి అధికారులతో సమీక్షలు చేశామన్నారు. ప్రణాళిక బద్ధంగా మూసీ ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఇక, గండిపేటలో ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. అలాగే, ఫామ్ హౌస్ ల డ్రైనేజీ నీళ్లను గండిపేట చెరువులో కలిపారని ఆరోపించారు. గండిపేట, మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లు కట్టుకున్నవాళ్లు.. లక్షలు, కోట్లు ఖర్చు చేసి నాపై సోషల్ మీడియాలో బద్నాం చేయించారు.. అయినా మేం భయపడలేదని వెల్లడించారు. ఇక, గుజరాత్ లో సబర్మతి ప్రాజెక్టు చేపట్టి 60 వేల కుటుంబాలను తరలించారు.. యూపీలో గంగా ప్రక్షాళన చేశారు.. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేస్తామని చెప్పారు.. నిజాం చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
