Site icon NTV Telugu

Minister Ponguleti: కాంగ్రెస్ని విలన్గా చిత్రీకరించే పనిలో కేసీఆర్ ఉన్నారు..

Ponguleti

Ponguleti

Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు. కాంగ్రెస్ నీ విలన్ గా చిత్రీకరించే పనిలో ఉన్నారు.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా అని ప్రశ్నించారు. కడుపులో విషం పెట్టుకుని కేసీఆర్ మాట్లాడారు.. కేసీఆర్ రెండు సార్లు అసెంబ్లీకి వచ్చారని మంత్రి పొంగులేటి తెలిపారు.

Read Also: Motorola Edge 60 Pro: ఇట్స్ అఫీషియల్.. భారత్‌లో విడుదల కానున్న మోటొరోలా ఎడ్జ్ 60 ప్రో

ఇక, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ కూడా రాలేదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం లేదు అని ఎద్దేవా చేశారు. గతంలో వరి వేస్తే ఉరి అన్నది మీరు కాదా.. రైతులను వరి వేసుకోవద్దు అన్నారు.. కానీ, మీ ఫామ్ హౌస్ లో మాత్రం వందల ఎకరాల్లో వరి వేసుకున్నారు అని ఆరోపించారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు పెట్టిన బాకీల కోసమే వాళ్ళు ధర్నా చేశారు.. సర్పంచుల గురించి మాట్లాడుతున్నారు.. కాంగ్రెస్ వచ్చాకా ఒక్క సర్పంచ్ కూడా పని చేయలేదు.. సర్పంచుల తిప్పలకి మీ పుణ్యమే కేసీఆర్ సమాధానం చెప్పు అని డిమాండ్ చేశారు. రూ. 1500 కోట్ల నిధులు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.. మీరు కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు.. మీ కుటుంబ సభ్యులకు వేలాది కోట్ల రూపాయలు వచ్చాయి.. గురివింద గింజ లాగా మాట్లాడకండి కేసీఆర్ అంటూ మంత్రి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

Read Also: EX CM KCR: 20-30% కమీషన్లు అని నేను అడగటం లేదు..

అయితే, రాహుల్ గాంధీ ఖమ్మం సభకు వస్తే.. సభను ఫెయిల్ చేయడానికి నిర్బంధం చేయలేదా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ సభకు బస్సులు కూడా ఇవ్వలేదు మీరు.. కానీ, మీ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని బస్సులు ఇచ్చాం.. మేము ఇబ్బంది పెట్టాలని అనుకుంటే మీ సభ జరిగేదా?.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కి ఉందా? అని ప్రశ్నించారు. మొగుడు.. పెళ్ళాం మాట్లాడుకున్న మాటలు కూడా విన్నది మీరు.. ఫోన్ ట్యాప్ చేసిన తొత్తులను అమెరికాలో దాచిపెట్టింది మీరు కాదా అని మంత్రి పొంగులేటి ఫైర్ అయ్యారు.

Exit mobile version