Kunamneni Sambasiva Rao: హైడ్రా అనేది ఒక భయానకమైన పేరు లాగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరినీ హడలెత్తిస్తున్నపేరు హైడ్రా .. ఇది డ్రాగన్ గా మారొద్దు.. అందరికీ ఉపయోగపడేవిధంగా ఉండాలన్నారు. నాగార్జున పెద్ద పర్సన్… ఆయన నిజంగా న్యాయం ఉంటే.. కోర్టు డిసైడ్ చేస్తుందన్నారు. ఇప్పటివరకు నాగార్జున, దానం నాగేందర్ లాండ్ ల కూల్చివేత జరిగిందన్నారు. కానీ… పెద్దవాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు… చిన్నవాళ్ళు కూడా అనేకమంది భయపడుతున్నారని తెలిపారు. పలుకుబడి ఉన్నవాళ్లు ఏదోకటి చేసుకుంటారు… కానీ పేదల ఇళ్ళని అలా కూలిస్తే రోడ్డున పడతారు.. వారి గురించి ఒకసారి ఆలోచించాలన్నారు. ధరణి పేరుతో గతంలో అనేక వేల ఎకరాల భూమి నీ ఆక్రమణలకు గురైందన్నారు. వీటన్నిటి పైనా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Read also: Begum Bazar Land: బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ.. గజానికి రూ.10 లక్షలు..!
పేదల ఇళ్ల విషయంలో పునరావాసం కల్పించకుండా కూల్చొద్దన్నారు. ఇక మధ్యతరగతి కుటుంబాలు అనేకం అపార్ట్మెంట్ లలో లోన్ లు పెట్టుకుని కొనుక్కున్నారు… వాళ్లకు పరిహారం ఇవ్వాలి… ఇది ప్రభుత్వ బాధ్యత అన్నారు. కొన్ని చెరువులు పనికిరావు.. వాటిలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే వాటిని రెగ్యులరెైజ్ చెయ్యాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయన్నారు. నెక్లెస్ రోడ్డు అంటున్నారు… అవి రోడ్లు.. ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్నాయన్నారు. మంచి పనులు ఎన్ని చేసినా ఒక్క చెడు పని చేస్తే చేసిన మంచి మొత్తం పోతుంది.. కాబట్టి సిఎం రేవంత్ రెడ్డి కి సూచన చాలా జాగ్రత్తగా చెయ్యండన్నారు. రంగనాథ్ కి ఏదైనా అప్పగిస్తే చాలా స్పీడ్ గా పనులు చేస్తారన్నారు. హైడ్రా కిందా ఎంత పెద్దవాళ్ళు ఉన్నాగాని లిస్ట్ బయట పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో కూడా అనేక ఆక్రమణలు జరిగాయి.. వాటికి అనుమతులు ఇచ్చిన వారిపైన కూడా యాక్షన్ తీసుకోండన్నారు.
Read also: CM Revanth Reddy: ఈరోజు తప్పితే దసరా వరకు కుదరదట.. భూమి పూజపై రేవంత్ కీలక వ్యాఖ్యలు..
ఇల్లీగల్ గా అమ్మలన్నా… కొనాలన్నా భయం ఉండాలన్నారు. అనుమతులిచ్చిన మాజీ మంత్రులు, అధికారులు.. ఎవరున్నా వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కవిత బెయిల్ విడుదల…పైనా కూడా రాజకీయం చేస్తున్నారు కొందరు,. ఒక ఆడపిల్ల… తప్పు చేస్తే కోర్టు నిర్ణయిస్తుంది… కానీ మీరెవరు… అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు రాజకీయం చేస్తున్నాయన్నారు. మహిళలకు ప్రత్యేక చట్టాలున్నాయి… వాటికి లోబడి కొన్ని కొన్ని సార్లు వారికి రిలాక్సేషన్ ఉంటుంది…దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ లో గందరగోళం వద్దు… ఆర్థిక సంక్షోభం ఉంది.. కానీ ప్రకటించారు కాబట్టి..తప్పదు కొన్నిసార్లని తెలిపారు. సెప్టెంబర్ 17 న తెలంగాణా విముక్తి దినోత్సవం జరుపుకోబోతున్నామన్నారు.
Read also: Constables Suspended: లంచాలు, యువతులతో ఖాకీల రాసలీలు.. సస్పెండ్ చేసిన హైదరాబాద్ సీపీ
అధికారికంగా గుర్తించాలి అని అందరూ చెబుతున్నారన్నారు. నిజమైన త్యాగాలు చేసిన.. ఈ ఉద్యమ.. వారసులం అర్హులము కమ్యూనిస్టులన్నారు. భూస్వామ్య వ్యవస్థ పై జరిగిన పోరాటం… ప్రభుత్వం దీన్ని గుర్తించాలన్నారు. ముక్దూం మొయినుద్దీన్, చాకలి ఐలమ్మ , కొమరం భీం… విగ్రహం ఏర్పాటు గురించి ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసామన్నారు. మేము ప్రభుత్వంలో మిత్రపక్షం… అయినప్పటికీ… మేము ఎప్పటికీ ప్రజల పక్షమే.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యమాలు చేస్తామన్నారు. కాంగ్రెస్ నీ ప్రశ్నిస్తాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిగా అవకాశం ఉన్నచోట కలిసి వెళ్తామన్నారు. లేనిచోట మా పార్టీ గా పోటీ చేస్తామన్నారు.
Hyderabad Crime: నర్సుపై డాక్టర్ అసభ్య ప్రవర్తన.. కారులో ఎక్కించుకుని..