KTR: హైదరాబాద్లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు..
- హైదరాబాద్ లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు..
- రేవంత్ సర్కార్ వల్లే ఇలా జరిగిందని మండిపడిన కేటీఆర్..
- హైదరాబాద్ ప్రజలు గందరగోళ పరిస్థితిలో కూరుకుపోయారు: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇళ్ల అమ్మకాలు పడిపోయాని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం జులై – సెప్టెంబర్ త్రైమాసికం ఇండ్ల అమ్మకాలు దాదాపు 42 శాతం పడిపోయినట్లు ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ నివేదికను రిలీజ్ చేసింది.. ఈ నివేదికను తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న మహానగరం సంక్షోభంలోకి వెళ్తుందనడానికి ఈ నివేదికనే నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
Read Also: Jasprit Bumrah: కాన్పూర్ టెస్ట్.. జస్ప్రీత్ బుమ్రా దూరం! తుది జట్టులోకి కుల్దీప్
Also Read
- Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
హైదరాబాద్ మహా నగరంలో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని ప్రాప్ ఈక్విటీ చెప్పుకొచ్చింది. గత ఏడాది ఇదే వ్యవధిలో 20,658 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.. దీంతో తాజా సర్వేలో అన్ని నగరాల కంటే హైదరాబాద్‌లోనే అత్యంత క్షీణత నమోదు అయింది. గత ఏడాదిదాకా దేశంలోనే అత్యంత ఎక్కువగా ఇండ్ల అమ్మకాలు ఇక్కడ జరిగాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలనూ దాటుకొని గడిచిన పదేళ్లలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మెరుపు వేగంతో దూసుకుపోయింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
A 42% crash in Hyderabad's housing market in just Q3! From a booming metropolis to a city in crisis, thanks to CM Revanth Reddy's disastrous administration; RR Tax and mad demolition drives
Investors are backing off, and the people of Hyderabad are suffering
What was once… pic.twitter.com/bgbMBESg7q
— KTR (@KTRBRS) September 25, 2024
- Tags
- BRS
- congress
- House sales
- hyderabad
- ktr
తాజావార్తలు
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
-
Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
-
Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..
-
Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
-
Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?