ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ఆర్ఆర్ ట్యాక్స్, కూల్చివేతల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా పడిపోయిందన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోవడంతో.. హైదరాబాద్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ మహా నగరం ఇవాళ గందరగోళ పరిస్థితుల్లో కూరుకుపోయిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో కొంత నిలకడగా ఉన్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగంలో నిలకడగా ఉన్నప్పటికీ ఇండ్ల అమ్మకాల్లో మాత్రం హైదరాబాద్ నగరం దేశంలోని మిగిలిన మెట్రోపాలిటన్ నగరాల కంటే ముందుంది.
House sales: హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.