Site icon NTV Telugu

KTR Tweet: ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..

Ktr

Ktr

KTR Tweet: తెలంగాణ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకొని పదేళ్లు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయని మండిపడ్డారు. ప్రజాస్వామిక తెలంగాణలో.. మళ్లీ ఎనుకటికాలంలా బూటుకాళ్ల శబ్దాలతో తెలంగాణ తెల్లవారే రోజులొచ్చాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నిస్తే కేసులు… హక్కులను అడిగితే బెదిరింపులు.. పోరాడితే సస్పెన్షన్లు… అని ట్వీట్ చేశారు. ఇది నియంతృత్వ రాజ్యం…నిర్బంధాన్ని నిర్మిస్తున్న ప్రభుత్వం అన్నారు. పోరాటం తెలంగాణకు కొత్తకాదు..ఈ మట్టి పొత్తిళ్ళలో పోరాటం ఉన్నదన్నారు. ఆ సహజత్వాన్ని ఎత్తిపడుతూ నిర్బంధాన్ని ఎదురిస్తామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ పునరుద్దరణకై పోరాడుతామన్నారు.


Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
Hyderabad: శ్రీనగర్ కాలనీ సబ్ స్టేషన్ ముందు ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

Exit mobile version