Site icon NTV Telugu

KTR: ధన్యవాదాలు CBN గారు.. మీ పాత శిష్యుడికి అవగాహన కల్పించండి..!

Ktr

Ktr

KTR: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై.. ముఖ్యంగా హైదరాబాద్‌ అభివృద్ధి, సైబరాబాద్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా వేదికల్లోనూ ప్రశంసలు కురిపించారు.. తాజాగా, దావోస్‌ పర్యటనలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలో పాల్గొన్న కార్యక్రమంలోనూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందంటూ చంద్రబాబు కీర్తించారు.. ఇక, సోమవారం మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది.. దానికి అక్కడి పాలసీలే కారణంగా పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.. ఇదే సమయంలో.. సీఎం రేవంత్‌రెడ్డికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

Read Also: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి

తన ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.. ఏపీ సీఎం మీడియాతో మాట్లాడిన క్లిప్‌ను ట్యాగ్‌ చేసిన కేటీఆర్‌.. “ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్లే భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (Highest per capita income) కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఏపీ సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారని పేర్కొన్నారు.. ఇక, ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు.. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడుకి దయచేసి అవగాహన కల్పించండి అని ఏపీ సీఎం చంద్రబాబుకు సూచిస్తూనే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌.. అయితే, సీబీఎన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన కేటీఆర్‌ ట్వీట్‌ను వైరల్‌ చేస్తున్నారు.

Exit mobile version