బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ASK KTR’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసి రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నానని కామెంట్స్ చేశారు. కానీ తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నానని తెలిపారు. తనను తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డిని వదిలి పెట్టనని హెచ్చరించారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.. ప్రతిరోజు తమకు దిశా నిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు.
Read Also: Maharashtra Polls: ముంబైలో పోస్టర్లు కలకలం.. నవంబర్ 23న ఫడ్నవీస్ రిటర్న్స్ అంటూ బ్యానర్లు
2025 నుంచి కేసీఆర్ విశ్వరూపం చూస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌కు వెళ్లడం కన్నా.. తనకు తెలంగాణలో ఉండడమే ఇష్టమని తెలిపారు. ఇప్పుడున్న జీహెచ్ఎంసీ స్వరూపం ఎలా మారుతుందో తెలియదు.. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పలేమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
Nimmala Rama Naidu: అందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారు: మంత్రి నిమ్మల
మూసీ పునరుజ్జీవనం దేశంలోనే అతిపెద్ద స్కాం.. హైడ్రా అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ అని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రాతో పేద, మధ్య తరగతి వాళ్ళ ఇళ్లు కూల్చుతున్నారని అన్నారు. కానీ పెద్దవాళ్ళ ఇళ్ల జోలికి రావట్లేదు.. ఇకపై పార్టీ బలోపేతం పై దృష్టి పెడతామని పేర్కొన్నారు. త్వరలో మహిళా, విద్యార్థి కమిటీలు వేస్తాము.. విలువలు లేని రాజకీయాలు మనం చేయలేము.. అవి ఎక్కువ కాలం ఉండవని కేటీఆర్ అన్నారు.