NTV Telugu Site icon

KTR: ఆమె కాంగ్రెస్‌ తల్లి.. తెలంగాణ తల్లి కాదు..

Ktr 3

Ktr 3

KTR: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.. అయితే, ఆమె తెలంగాణ తల్లి కాదు.. కాంగ్రెస్‌ తల్లి అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.. తలరాత మార్చమని ప్రజలు అధికారం ఇచ్చారు.. కానీ, తల్లిని మార్చమని కాదు.. అంటూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై సెటైర్లు వేశారు.. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పటికే ఉంది.. బహుజన తల్లి బంగారం వేసుకోకూడదా? అని నిలదీశారు కేటీఆర్‌.. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ విగ్రహం తెలంగాణ తల్లిది కాదు.. కాంగ్రెస్‌ తల్లిది అని విమర్శించారు కేటీఆర్‌..

Read Also: Indian Coast Guard: 2 బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్..

అంతేకాదు.. అధికారంలో ఉన్న పార్టీ మారితే తల్లి మారుతుందా? అని మండిపడ్డారు కేటీఆర్‌.. వీళ్లు ఏం చేసినా మూడేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది.. మూడేళ్ల తర్వాత రాహుల్‌ తండ్రిని, కాంగ్రెస్‌ తల్లిని గాంధీ భవన్‌కు పంపిస్తాం అని స్పష్టం చేశారు.. బతుకమ్మ తీసేసి చెయ్యి పెట్టారు.. మేం పేదల బతుకులు మార్చే పనిచేశాం.. పేర్లు మార్చే పనిచేయలేదు.. అలా చేసుంటే రాజీవ్‌, ఇందిరా గాంధీ పేర్లతో ఒక్క సంస్థ ఉండేది కాదు అని హెచ్చరించారు.. ఇక, ఎనుముల బద్రర్స్‌ అంబానీ బ్రదర్స్‌తో పోటీపడుతున్నారని ఆరోపించారు.. అదానీ టీషర్టల్‌లు రాహుల్ గాంధీ మాకు పంపారు అని ఎద్దేవా చేసిన ఆయన.. ఓవైపు ఢిల్లీలో కుస్తీ చేస్తూ గల్లీలో దోస్తీ చేస్తామంటే కరెక్టా..? అని ప్రశ్నించారు..

Show comments