Hydra Commissioner Ranganath: హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ల కు పాల్పడితే జైలుకే అని హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులో తీసుకున్న ఘటనపై హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ స్పందించారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ కేటుగాళ్లు బెదిరంపులు చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందని అన్నారు. అలాంటి వారు ఎవరైనా వుంటే గుర్తించి తమ దృష్టికి తేవాలని రంగనాథ్ ప్రజలను కోరారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల కు సామజిక కార్యకర్తల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు వున్నాయని మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎలాంటి సమస్య రాకుండా కొంత డబ్బు ముట్టజెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రా కు ఫిర్యాదు చేస్తామని కొద్ది మంది వ్యక్తులు, సంస్థలు బిల్డర్లను బెదిరింపులు పాల్పడుతున్నారని అన్నారు.
Read also: Ganesh Chaturthi: వినాయకచవితి సందడి షురూ.. జనాలతో కిటకిటలాడుతున్న హైదరాబాద్ మార్కెట్లు
ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది సైతం బెదిరించిన సమాచారం అందించాలన్నారు. డబ్బు వసూళ్ల చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకోబడుతాని హైడ్రా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే హైడ్రా పేరుతో డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా ను అరెస్ట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా ను పోలీసులు అదుపులో తీసుకున్నారని తెలిపారు. ఇప్పటి కైనా ఇలాంటి వారిపట్లు ప్రజలు, బిల్డర్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read also: TG Rain Alert: నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
హైడ్రా పేరుతొ డబ్బు వసూళ్ళకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..
సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతానికి చెందిన డా. విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్ ను డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా సదరు బాధిత బిల్డర్ గత సోమవారం రోజున హైడ్రా కమిషనర్ కలుసుకొని ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన వాస్తవాలు గ్రహించి అనంతరం హైడ్రా కమిషనర్ సూచన మేరకు ఎస్పీ సంగారెడ్డి బాధిత బిల్డర్ నుండి ఫిర్యాదు స్వీకరించారు. ఈ ఫిర్యాదుతో ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న డా. విప్లవ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసారు. నిందితుడిని పోలీసులు ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Minister Sridhar Babu: మంథని వద్ద గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్