Site icon NTV Telugu

Talasani Srinivas: లా అండ్ ఆర్డర్ లేకపోతే.. మీ వాళ్ళు తిరిగే వాళ్ళా?

Talasani Srinivas

Talasani Srinivas

లా అండ్ ఆర్డర్ మాది లేకపోతే మీ వాళ్ళు తిరిగే వాళ్ళా అంటూ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ బీజేపీ శ్రేణుల‌పై మండిప‌డ్డారు. బీజేపీ కేంద్రం ఏమిచ్చిందో శ్వేతా పత్రం ఇవ్వాలని కోరారు. తెలంగాణ లో ఆల‌యాల‌ గురించి మాట్లాడారు క‌దా.. మ‌రి దేవాలయాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు త‌ల‌సాని. ధాన్యం కొనుగోలు గురించి ఇప్పటికి ఇంకా సందిడ్గం కొనసాగుతూనే వుంద‌ని అన్నారు. సింగిల్ ఇంజన్ సర్కార్ తోనే అన్నీ అభివృద్ధి చేస్తున్నామ‌ని గుర్తు చేశారు. మీ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఏ రాష్ట్రాల్లో అభివృద్ధి సాగుతోందని ప్ర‌శ్నించారు.

read also: COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు

టీఆర్ఎస్‌ చేసిన అభివృద్ధి మీ పాలిత రాష్ట్రాల్లో అమలు అవుతుందా అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. నిన్న బీజేపీ సభలో మా బల్కంపేట టెంపుల్ కి వచ్చిన మంది రాలేదంటూ ఎద్దేవ చేశారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకి మోడీ ఒక్క సమాధానం ఇవ్వలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. టెక్స్ట్ టైల్ పార్క్ అన్నారు ఇచ్చారా? కోచ్ ఫేక్టరీ ఇచ్చారా అంటూ మండిప‌డ్డారు. అమిత్ షా కూడా ఇష్టానుసారంగా మాట్లాడారని నిప్పులు చెరిగారు. బీజేపీ ని బలోపేతం చేయలంటే కేంద్రం ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వాలి కదా? అని ప్ర‌శ్నించారు త‌ల‌సాని. దేశం నుండి బీజేపీ ప్రభుత్వం పోవాలని అన్నారు. మూడేళ్లనుండి ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎన్ని సార్లు వచ్చాడు? అభివృద్ధి చేశాడా అంటూ ప్ర‌శ్నించారు. చిల్లర రాజకీయాలు టీఆర్ ఎస్ చేయ‌ద‌ని, మోడీ తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని మంత్రి త‌లసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మండిప‌డ్డారు.

Exit mobile version