Hydraa Demolition: హైదరాబాద్‌లోని కొండాపూర్ సర్వే నెంబర్ 59లో వద్ద హైడ్రా కూల్చివేతలకు దిగింది. కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించబడిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ కూల్చివేతలు భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతుంది. ఇక, మీడియాను కూడా కూల్చివేతల దగ్గరకు అనుమతించకపోగా, రెండు కిలోమీటర్ల దూరంలోనే స్థానికులను, జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈ భూమిపై కొనసాగుతున్న వివాదానికి అనుకూలమైన తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చింది. ఈ భూమి ప్రభుత్వ ఆస్తిగా తేల్చడంతో.. ఆ తీర్పు ఆధారంగా అధికారులు కబ్జాలను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు.