Hydra: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ టీమ్‌లు కొనసాగిస్తున్నాయి. మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను కూల్చివేస్తున్నారు. మల్లంపేట కత్వా చెరువు, దుండిగల్‌లోని అనధికారిక విల్లాలను కూడా హైడ్రా కూల్చివేస్తోంది. ఎఫ్‌టిఎల్‌లోని మూడు నిర్మాణాలను, బఫర్ జోన్‌లోని 5 విల్లాలను హైడ్రా కూల్చివేస్తోంది. గత సోమవారం కత్వ చెరువులో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీ అక్రమంగా నిర్మించిన విల్లాలను హైడ్రా అధికారులు పరిశీలించారు. సున్నం చెరువు మొత్తం వైశాల్యం 26 ఎకరాలు. చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిలో భారీ షెడ్లు, భవనాలు ఉన్నాయి. హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు.
Read also: Murali Mohan: హైడ్రా అవసరం లేదు.. మేమే కూల్చేస్తాం.. నోటీసులపై మురళీమోహన్..
సున్నం చెరువు ఎఫ్‌టీఎల్‌లో సర్వే నంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి అక్రమార్కులు వ్యాపారాలు సాగిస్తున్నారు. భారీ నిర్మాణాల మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని కత్వా సరస్సులోని 170/13.4,5 సర్వే నంబర్లలోని 8 విల్లాలను హైడ్రా అధికారులు ధ్వంసం చేశారు. అలాగే మల్లంపేట కత్వ చెరువు ఎఫ్ టీఎల్ విస్తీర్ణం 142 ఎకరాలు. ఇక్కడ, లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ 2020-21 సంవత్సరానికి 320 విల్లాలను నిర్మించింది. కానీ 60 విల్లాలకు మాత్రమే హెచ్‌ఎండీ అనుమతి తీసుకున్నారు. మరికొన్ని ఫోర్జరీ సంతకాలతో నిర్మించారని ఆరోపించారు. మేడ్చల్ కలెక్టర్ హరీశ్ నేతృత్వంలో డీపీఓ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 208 విల్లాలను సీజ్ చేసి వాటికి అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. వీటికి కరెంట్ కనెక్షన్, నీటి కనెక్షన్, రిజిస్ట్రేషన్, బ్యాంకు అధికారుల నుంచి రుణాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆర్డినెన్స్ ఇచ్చింది.
Read also: MegaStar : ఆత్మారావుగా ‘కంట్రీ డిలైట్’ యాడ్ లో అదరగొట్టిన ‘మెగాస్టార్ చిరంజీవి’
మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో హైడ్రా అధికారులు మరో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు. రెండేళ్ల క్రితం కూల్చివేసిన మున్సిపల్ అధికారులు.. మళ్ళీ యజమాని నిర్మాణం చేపట్టారు. అనుమతులు లేకుండానే G+2 నిర్మాణం చేపట్టడంతో హైడ్రా అధికారులు ఎంట్రీ ఇచ్చారు. కూల్చివేసిన మళ్లీ నిర్మాణం చేపట్టారని కూల్చివేశారు అధికారులు. ఇక మరోవైపు షబ్బీర్ భాయ్ బిర్యానీ వాలా హోటల్ ను కూల్చివేస్తున్నారు. దీంతో హోటల్ యజమాని అడ్డుకున్నారు. ఇది అక్రమ నిర్మాణమని అందుకే కూల్చేస్తున్నట్లు తెలిపారు. దీంతో భారీగా స్థానికులు మోహరించడంతో పోలీసులు చెదరగొడుతున్నారు.
Karimnagar: అసలే కోతులు.. కంగారు పెట్టి చివరకు నవ్వించిన ఘటన..