అమరావతిలో లే ఔట్‌లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్‌లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ.. ఇవాళ 24,276.83 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు అనుమతులిచ్చింది.. మొత్తం ఖర్చు 62 వేల కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకూ 45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు..
Hydra: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ టీమ్‌లు కొనసాగిస్తున్నాయి.
రుషికొండ నిర్మాణాలపై మరోసారి ఏపీ హైకోర్టు విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై మరోసారి ఎంక్వైరీ చేయాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం హాట్ హాట్ గా వుంటుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం మామూలుగా వుండదు. తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ ముందు జేసీ దీక్షకు దిగారు.…