Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు..
- మాసబ్ ట్యాంక్ లోని ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
- ఒకరు మృతి-పలువురికి గాయాలు..
- రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై మరో ప్రమాదం..
- ఈ ప్రమాదంలో డాక్టర్ మృతి ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Road Accident: రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలకు తీసుకుంటున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇవాళ నగరంలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదం జరుగగా.. మరో ప్రమాదం మేడ్చల్ లో చోటుచేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
Read also: Fraud: ప్రముఖ పారిశ్రామికవేత్తను మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.7కోట్లు
Also Read
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
- CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
- Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్ వద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన క్యాబ్.. డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో క్యాబ్ ముందు సీటులో కూర్చున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్యాబ్ లో ఉద్యోగులను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. సాయితేజ మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. నేడు తులం ఎంతుందంటే?
రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై మరో ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం ఒక్కసారి బోల్టా కొట్టిందిఈ ప్రమాదంలో నీలయరెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీలయ రెడ్డి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి వైద్యుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read also: Fraud: ప్రముఖ పారిశ్రామికవేత్తను మోసం చేసిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.7కోట్లు
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘటన చోటుచేసుకుంది. డివైడర్ ను బైక్ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెంది గా మరొకరు తీవ్ర గాయాలయ్యాయి. జగద్గిరిగుట్ట కు చెందిన మజ్జి శ్రీకాంత్, మున్నూరు నరేష్ తమ ద్విచక్ర వాహనంపై కామారెడ్డి వైపు వెళ్తుండగా మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఆత్వెల్లి మసీదు వద్ద డివైడర్ ను ఢీ కొట్టారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతిచెందగా నరేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయాలైన నరేష్ ను ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
OTT Releases: అక్టోబర్ తొలివారంలో ఒకే ఓటీటీలోకి మూడు తెలుగు సినిమాలు
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!