OTT Releases: ఇటీవల కాలంలో ఓటీటీ ల్లోనే సినిమాలు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే పోటీ పడి మరీ వాటి యజమానులు సినిమాలను ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ తొలి వారంలో వివిధ ఓటీటీల్లో తెలుగు సినిమాలు రానున్నాయి. కాగా, ఒక్క ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే మూడు చిత్రాలు రానున్నాయి. థియేటర్లలో రిలీజై సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘35 – చిన్నకథ కాదు’ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. వాయిదా పడిన బాలుగాని టాకీస్ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. అంతే కాకుండా మరో హారర్ థ్రిల్లర్ మూవీ కూడా ఎంట్రీ ఇవ్వనుంది.
35 – చిన్న కథ కాదు
నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించిన ‘35-చిన్న కథ కాదు’ మూవీ థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సెప్టెంబర్ 6న ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి నందకిశోర్ ఇమామీ దర్శకత్వం వహించారు. విశ్వదేవ్, ప్రియదర్శి, అరుణ్ దేవ్ కీలక పాత్రలు చేశారు. థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి రానుంది. 35 – చిన్న కథ కాదు చిత్రం అక్టోబర్ 2నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తేదీని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. పాజిటివ్ బజ్ ఉండటంతో ఓటీటీలో ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కే అవకాశం ఉంది. సృజన్ ఎరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దగ్గుబాటి రానా సమర్పించారు.
కళింగ
ఇటీవల కాలంలో హర్రర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఆడియెన్స్ కోసం వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కళింగ’. సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ధృవవాయు ఈ చిత్రంలో హీరోగా నటించటంతో పాటు దర్శకత్వం వహించారు. ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. కళింగ మూవీని త్వరలో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఆహా ఓటీటీ ప్రకటించింది. అయితే, ఇంకా డేట్‍ను ఖరారు చేయలేదు. అయితే, అక్టోబర్ 2రోజే ఈ చిత్రాన్ని ఆహా స్ట్రీమింగ్ చేస్తుందని సమాచారం.
బాలుగాని టాకీస్
బాలుగాని టాకీస్ వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ చిత్రం.. థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13వ తేదీనే తీసుకురానున్నట్టు ఆహా గతంలో చెప్పింది. అయితే, వాయిదా పడింది. అక్టోబర్ 4న ఈ మూవీ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది. ఈ తేదీని ఇప్పటికే ఆహా ఓటీటీ ప్రకటించింది. బాలుగాని టాకీస్ మూవీలో శివ రామచంద్రవరపు హీరోగా నటించారు. ఓ ఊర్లో థియేటర్ నడిపే అతడు బాలకృష్ణకు వీరాభిమానిగా ఉంటారు. అయితే, తన థియేటర్ విషయంలో చిక్కుల్లో పడతాడు. దీని చుట్టూనే ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాక్ రెడ్డి, వంశీ నెక్కంటి కూడా కీలకపాత్రలు చేశారు. బాలుగాని టాకీస్ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించారు.
New Project (25)[/caption]